Apr 16 2021 @ 23:25PM

మరో హిందీ దర్శకుడితో పాన్‌ ఇండియా చిత్రం!

ప్రభాస్‌ మరో పాన్‌ ఇండియా చిత్రం చేయడానికి సూత్ర ప్రాయంగా అంగీకరించారని వినికిడి. దీనిని భారీ నిర్మాణ వ్యయంతో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి దర్శకుడిగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ను ఎంపిక చేశారట. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘వార్‌’తో భారీ విజయం అందుకున్నారీ దర్శకుడు. ప్రస్తుతం షారూఖ్‌ ఖాన్‌ హీరోగా ‘పఠాన్‌’ తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ప్రభా్‌సను కలిసిన సిద్ధార్థ్‌ ఆనంద్‌, ఓ లైన్‌ వినిపించారట. అంతే కాదు... హీరో నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ అందుకున్నారని సమాచారం.


ప్రస్తుతం హిందీ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్‌’, కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ‘సలార్‌’ చేస్తున్నారు ప్రభాస్‌. ఆ తర్వాత ‘మహానటి’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేస్తారు. ఈ మూడు చిత్రాలు పూర్తయ్యాక... సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను సెట్స్‌కు తీసుకువెళ్తారట.