Oct 9 2021 @ 13:11PM

Prabhas: 'స్పిరిట్' 9 భాషల్లో రిలీజ్‌కి ప్లాన్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. 'స్పిరిట్' అనే వెరైటీ టైటిల్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాను ఆల్రెడీ 8 భాషలలో రిలీజ్ చేయనున్నట్టు ప్రాజెక్ట్ ప్రకటించినరోజే వెల్లడించారు. ఈ సినిమాకి 'అర్జున్ రెడ్డి' సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. ఈ మూవీ ఏకంగా ఎనిమిది భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించడంతోనే ఇది పాన్ వరల్డ్ మూవీ అని అందరూ ఫిక్స్ అయ్యారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, చైనీస్, జాపనీస్ భాషలు సహా మొత్తం ఎనిమిది భాషలలో రిలీజ్ కానుంది. అయితే, ఇదే క్రమంలో 'స్పిరిట్' చిత్రాన్ని ఇంగ్లీష్ భాషలోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. ఇప్పటికే 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కే' ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ రకంగా చూస్తే ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న 'స్పిరిట్' మొత్తం 9 భాషల్లో రిలీజ్ అవడం పక్కా అని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.