Abn logo
Jul 13 2020 @ 18:26PM

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టైటిల్ సృష్టికర్త ఎవరో తెలుసా?

రెబ‌ల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో వంశీ, ప్రమోద్‌, ప్ర‌శీదలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ప్రభాస్ 20వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఇటీవలే టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఈ చిత్రంలో ‘బుట్టబొమ్మ’ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఫస్ట్‌లో ఈ చిత్రానికి ‘జాన్’ అనే టైటిల్ బాగా వినబడింది. కానీ అలాంటి టైటిల్‌తోనే శర్వానంద్, సమంతలు నటించిన చిత్రం విడుదల కావడంతో టైటిల్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. శర్వా, సమంతల చిత్రానికి ‘జాను’ అనే టైటిల్ నిర్మాత దిల్ రాజు ఫిక్స్ చేయడంతో.. ప్రభాస్ 20 చిత్రానికి మొదటి నుంచి అనుకున్న టైటిల్‌ను మార్చాల్సి వచ్చింది. అప్పుడు నిర్మాత రాధాకృష్ణ కుమార్‌కు ఏం చేయాలో తెలియలేదట.


ఇక చేసేది లేక తన గురువుకు ఈ విషయం చెప్పడంతో, ఆయనే ఈ చిత్రానికి ‘రాధేశ్యామ్’ అనే టైటిల్‌ను సజెస్ట్ చేశారట. ఇంతకీ రాధాకృష్ణ కుమార్ గురువు ఎవరో తెలుసా? సెన్సిటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి. ఆయన దగ్గర రాధాకృష్ణ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. కథ గురించి ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ‘రాధేశ్యామ్’ టైటిల్ పర్ఫెక్ట్‌గా సరిపోతుందని చంద్రశేఖర్ యేలేటి సూచించడంతో.. వెంటనే రాధాకృష్ణ కుమార్ చిత్ర నిర్మాతలకు, అలాగే ప్రభాస్‌కు టైటిల్ ‘రాధేశ్యామ్’ అని తెలిపారట. వారి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో.. ఫైనల్‌గా ఈ టైటిల్‌నే ప్రభాస్ 20 చిత్రానికి ఫిక్స్ చేసినట్లుగా టాక్. సో.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ టైటిల్ సృష్టికర్త ఎవరో తెలిసిందిగా.

Advertisement
Advertisement
Advertisement