Jun 23 2021 @ 14:32PM

ప్రభాస్ ...రూ.150 కోట్లు వద్దనుకున్నారా?

‘బాహుబలి’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్ర‌భాస్ క్రేజ్ ఖండాంత‌రాలు దాటింద‌న‌డంలో సందేహం లేదు. ఇప్పుడు ప్ర‌భాస్ వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో ఫుల్ బిజీగా మారిపోయారు. ఈ స్టార్ హీరోకు ఉన్న క్రేజ్‌ను ప‌లు కంపెనీలు సొమ్ము చేసుకోవాల‌నుకున్నాయి. అయితే ప్ర‌భాస్ వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల విష‌యంలో అచి తూచి అడుగులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. యాడ్స్ కంటే సినిమాల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీంతో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ రూపంలో ప్ర‌భాస్ రూ.150 కోట్ల మేర‌కు న‌ష్ట‌పోయారంటూ వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త‌న ఫ్యాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఏ యాడ్ ప‌డితే అది చేయ‌కూడ‌ద‌ని, వాటి కంటే సినిమాలు చేయ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని ఆలోచించ‌డం వ‌ల్ల ప్ర‌భాస్ డ‌బ్బులను ప‌ట్టించుకోలేదని టాక్‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ‘రాధేశ్యామ్’ సినిమా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. మ‌రో వైపు ‘స‌లార్, ఆదిపురుష్’ వంటి పాన్ ఇండియా చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి.