Abn logo
Oct 24 2020 @ 01:07AM

ప్రభాస్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌!

Kaakateeya

ప్రభాస్‌ తన అభిమానులకు ప్రత్యేక బహుమతి ఇచ్చారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘రాధేశ్యామ్‌’ చిత్ర బృందం ‘బీట్స్‌ ఆఫ్‌ రాధే శ్యామ్‌’ పేరుతో మోషన్‌ పోస్టర్‌ విడుదల చేసి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రాధాకృష్ణ దర్శకత్వంలో గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్న చిత్రమిది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్యగా నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. చరిత్రలో నిలిచిపోయిన గొప్ప ప్రేమికులు దేవదాస్‌, పార్వతి, లైలా మజ్ను ఫోటోల మీదుగా ఓ ట్రైన్‌లో సాగే మోషన్‌ పోస్టర్‌,  జస్టిన్‌ ప్రభాకరన్‌ అందించిన  నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. తెలుగు, మలయాళ, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ‘రాధేశ్యామ్‌’ను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. సత్యరాజ్‌, భాగ్యశ్రీ, కునాల్‌ రాయ్‌ కపూర్‌, జగపతిబాబు, జయరాం, సచిన్‌ ఖేడ్‌కర్‌, మురళీశర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: యు వి కృష్ణంరాజు, సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస.

Advertisement
Advertisement