Abn logo
Apr 7 2021 @ 16:34PM

'మాస్టర్‌' డైరెక్టర్‌తో ప్రభాస్‌..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ.. ఏకధాటిగా పక్కా ప్లానింగ్‌తో సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఒక వైపు పాన్‌ ఇండియా మూవీ 'రాధేశ్యామ్‌' విడుదలకు సన్నద్ధం అవుతుండగానే మరో రెండు పాన్‌ ఇండియా మూవీస్‌ 'సలార్‌', 'ఆదిపురుష్‌' సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ సినిమాలను పూర్తి చేయగానే నాగ్‌ అశ్విన్ సినిమా షూటింగ్‌కు ప్రభాస్‌ రెడీ అయిపోతాడు. అయితే ప్రభాస్‌ ఆలోచన మరోలా ఉందట. నాగ్‌ అశ్విన్‌ సినిమాతో పాటు మరో సినిమాను కూడా ట్రాక్‌ ఎక్కించాలని భావిస్తున్నాడు. అందులో భాగంగా కోలీవుడ్‌ డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఓ పాన్‌ ఇండియా సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 'మాస్టర్‌' రిలీజ్‌ సమయంలో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ .. ప్రభాస్‌ను కలిసి పాయింట్‌ చెప్పాడట. అది ప్రభాస్‌కు నచ్చడంతో అప్పటి నుంచి లోకేష్‌ కనకరాజ్‌తో టచ్‌లో ఉన్నాడట. స్క్రిప్ట్‌ అంతా సిద్ధమైన తర్వాత ఫైనల్‌ కాల్‌ తీసుకుంటారని సినీ వర్గాల్లో వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. 


Advertisement
Advertisement
Advertisement