Abn logo
Aug 13 2020 @ 00:08AM

2022లో ప్రభాస్‌22?

కన్నడ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో ప్రభాస్‌ ఓ సినిమా చేయబోతున్నారా? ‘కె.జి.యఫ్‌’ తరహాలో భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్లాన్‌ చేశారా? అంటే... ఫిల్మ్‌ నగర్‌ వర్గాల నుంచి ‘అవును’ అనే మాట వినపడుతోంది. ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 1’ కంటే ముందు ప్రశాంత్‌ నీల్‌ ‘ఉగ్రం’ తీశారు. దర్శకుడిగా ఆయన తొలి చిత్రమది. ‘ఉగ్రం’ విడుదలైన తర్వాత ప్రభాస్‌ను ఒకసారి కలిసి సినిమా విషయమై చర్చలు జరిపారట. అయితే, అప్పట్లో కార్యరూపం దాల్చలేదు. ఈ మధ్య మరో ఐడియా చెప్పగా... హీరోకి నచ్చిందట. కథ సిద్ధం చేయమని చెప్పారట. ప్రస్తుతం రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్‌’ చేస్తున్నారు ప్రభాస్‌. అది పూర్తయిన తర్వాత నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేయనున్నారు. హీరోగా ఆయనకు 21వ చిత్రమది. దాని తర్వాత ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో 22వ చిత్రం చేయనున్నారనీ, 2022లో చిత్రీకరణకు వెళతారనీ సమాచారం. ఈలోపు ప్రస్తుతం ‘కె.జి.యఫ్‌: ఛాప్టర్‌ 2’ చేస్తున్న దర్శకుడు, ఆ తర్వాత చిన్న ఎన్టీఆర్‌ హీరోగా సినిమా చేయనున్నారు. ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్‌ కలయికలో చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించనుందని సమాచారం.

Advertisement
Advertisement
Advertisement