Jun 11 2021 @ 07:56AM

‘బాహుబ‌లి’ని మించేలా ప్ర‌భాస్ 25..!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అయితే ఫ్యాన్స్ దృష్టి ఆయ‌న చేయ‌బోయే 25వ చిత్రంపైఉంది. ప్ర‌భాస్ రేంజ్‌, క్రేజ్ పెరిగిన నేప‌థ్యంలో ఎలాంటి మూవీ చేస్తారోన‌ని అంద‌రిలో ఆస‌క్తి పెరిగింది. అయితే లేటెస్ట్ సినీ వ‌ర్గాల స‌మాచారం మేర‌కు ప్ర‌భాస్ 25ను దిల్‌రాజు నిర్మిస్తారు. ‘బాహుబ‌లి’ని మించేలా భారీ బ‌డ్జెట్‌తో మైథిలాజిక‌ల్ జోన‌ర్‌లో సినిమాను నిర్మించ‌డానికి ఈ అగ్ర నిర్మాత స‌మాయ‌త్త‌మ‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో ‘స‌లార్’ సినిమాను డైరెక్ట్ చేస్తోన్న ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తారట‌. ఒక‌వైపు ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ‘రాధేశ్యామ్’ విడుద‌లకు సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు స‌లార్‌, ఆదిపురుష్ సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. ఇవి పూర్త‌యిన త‌ర్వాత ప్ర‌భాస్ 25ను అనౌన్స్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.