Advertisement
Advertisement
Abn logo
Advertisement

పక్కా గృహాలకు ప్రభుత్వమే రిజిస్ర్టేషన్‌ చేయాలి

 గన్నవరం, డిసెంబరు 3: గతంలో నిర్మించుకున్న పక్కా గృహాలకు ప్రభుత్వం ఉచి తంగా రిజిస్ర్టేషన్‌ చేయాలని సీపీఎం జిల్లా (తూర్పు) కార్యదర్శి వై.నరసింహరావు డిమాం డ్‌ చేశారు. మండలంలోని చనుపల్లివారిగూడెంలో సీపీఎం బృందం శుక్రవారం పర్యటిం చింది. పక్కాగృహాల లబ్ధిదారులతో మాట్లాడి ఓటీఎస్‌ సమస్యను తెలుసుకున్నారు. ఎప్పుడో 30ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లకు ఓటీఎస్‌ కింద రూ.10 వేలు కట్టాలని అధికారులు ఒత్తిడి చేస్తు న్నారని, కట్టలేమని చెబుతున్న వినిపించుకోవటం లేదని పేదలు సీపీఎం బృందం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికి పేదల ఇళ్లపై అప్పులను తీర్చమని ఒత్తిడి చేయటం సరికాదన్నారు. జిల్లాలో లక్షలాది మంది ఓటీఎస్‌ విధానం తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు ఒత్తిడి పెరిగిపోయి ఏం చేయాలో తెలి యని దుస్థితిలో ప్రజలు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పక్కా గృహాలను ఉచితంగా రిజిస్ర్టేషన్‌ చేయాలన్నారు. ఓటీఎస్‌కు వ్యతిరే కంగా అన్ని సచివాలయాల వద్ద ఆందోళనలు చేయాలని పిలుపు నిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు, బెజవాడ తాతబ్బాయి, సుబ్బారావు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement