Abn logo
Oct 25 2021 @ 00:43AM

ప్రభుత్వ భూమి రక్షణకు ప్రహరీ నిర్మించాలి

గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ శ్రీలత

రుద్రంగి ఆక్టోబర్‌ 24: రుద్రంగి మండల కేంద్రంలోని బస్టాండ్‌ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేస్తున్నారని, వెంటనే ప్రహరీ నిర్మించాలని గ్రామస్థులు డిమా ండ్‌ చేశారు.  ఆదివారం బస్టాండ్‌కు ఆనుకొని ఉన్న  గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్రభుత్వ భూమి కబ్జా గురి కాకుండా ప్రహరీ నిర్మిం చడానికి  గ్రామస్థులు సిద్ధమ య్యారు.  విషయం తెలునుకున్న సీఐ శ్రీలత అక్కడికి చేరు కొని  కుల సంఘాల నాయకులు, గ్రామస్థులకు నచ్చజెప్పారు. సర్వే నిర్వహించుకొని సమస్యను సామరస్యంగా పరిష్క రించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామస్థులు మాట్లా డుతూ  నెల రోజుల క్రితం సర్వే నిర్వహించాలని  మండల కేంద్రలో ధర్నా చేపట్టామన్నారు.  సర్వే నిర్వహిస్తామని చెప్పి  నెల రోజులు గడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.     ఉప సర్పంచ్‌ బైరి గంగ మల్లయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్‌, కాంగ్రెస్‌ గ్రామ అఽధ్యక్షుడు సామ మోహన్‌రెడ్డి, నాయకులు తర్రె మనోమర్‌, చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయణ, పల్లి గంగాధర్‌, వడ్ల నారాయణ, నైవురి కిషన్‌, పుట్కపు మహిపాల్‌ పాల్గొన్నారు.