నిజంగా...అద్భుతమే!

ABN , First Publish Date - 2020-07-14T08:57:31+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్‌ క్రికెట్‌ ప్రేమికులకు అసలు సిసలు మజాను పంచింది...

నిజంగా...అద్భుతమే!

విండీస్‌ విజయంపై క్రికెటర్ల ప్రశంసలు

న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్‌ తర్వాత ఇంగ్లండ్‌-వెస్టిండీస్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్‌ క్రికెట్‌ ప్రేమికులకు అసలు సిసలు మజాను పంచింది. వైరస్‌ విజృంభిస్తుండడంతో విండీస్‌ టాప్‌ ప్లేయర్లు డారెన్‌ బ్రావో, హెట్‌మయర్‌, కీమో పాల్‌ ఇంగ్లండ్‌ టూర్‌కు విముఖత ప్రదర్శించారు. దీంతో అందుబాటులో ఉన్న వారితోనే కరీబియన్లు ఇంగ్లండ్‌ పర్యటనకు వచ్చారు. అయితే, ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన  హోల్డర్‌ సేన అద్భుత పోరాటంతో ఆతిథ్య జట్టుకు దిమ్మదిరిగే షాకిచ్చారు. విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడినా..గాబ్రియెల్‌ బౌలింగ్‌, బ్లాక్‌వుడ్‌ బ్యాటింగ్‌తో విండీస్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. విండీస్‌ అద్వితీయ విజయాన్ని ప్రశంసిస్తూ ప్రస్తుత, మాజీ ఆటగాళ్లు ట్వీట్ల వర్షం కురిపించారు.


బ్రేక్‌ తర్వాత తొలి మ్యాచ్‌ మాదే. కుర్రాళ్లు అద్భుత పోరాట పటిమను ప్రదర్శించారు. విజయానికి అన్ని విధాలా అర్హులు. మమ్మల్ని గర్వపడేలా చేశారు. 

-వెస్టిండీస్‌ దిగ్గజం వివ్‌ రిచర్డ్స్‌


ఇరు జట్లు అద్భుతమైన ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేశాయి. ఒత్తిడి సమయంలో బ్లాక్‌వుడ్‌ గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడు. సిరీస్‌ ఆరంభం అదిరింది. 

-సచిన్‌ టెండూల్కర్‌


‘అద్భుతమైన టెస్ట్‌ క్రికెట్‌ ప్రదర్శన...వావ్‌ విండీస్‌’     

   -భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ 

Updated Date - 2020-07-14T08:57:31+05:30 IST