Abn logo
Jan 14 2021 @ 15:40PM

రోహిత్ నందన్‌తో `ల‌డీ ల‌డీ` అంటూ ప్రియా వారియర్ చిందులు

సెన్సేషనల్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ తొలిసారి ప్రైవేట్ సాంగ్‌లో నటించారు. రోహిత్ నందన్‌ ఇందులో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌తో క‌లిసి స్టెప్పులేశాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ ఈ పాటను తెరకెక్కించారు. రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడారు. సంక్రాంతి సందర్భంగా లడీ లడీ పాటను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించిన ఈ పాటకు విస్సాప్రగడ లిరిక్స్ అందించారు. పబ్ లో పక్క మాస్ బీట్ లో సాగిపోయే ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రియా వారియర్ అందాలు.. రోహిత్ నందన్ అద్భుతమైన డాన్స్ పాటకు హైలైట్స్. మ్యాంగో సంస్థ నుంచి ఈ పాట విడుదలైంది. 


Advertisement
Advertisement
Advertisement