Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజా సమస్యల పరిష్కారానికే స్పందన

 కడవకొల్లు(ఉయ్యూరు), డిసెంబరు 6 : సమస్యలు తెలుసుకుని పరిష్కరిం చేందుకు అమలు చేస్తున్న స్పందన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకో వాలని ఉయ్యూరు మండల తహసీల్దార్‌ కె.నాగేశ్వరరావు అన్నారు. కడవకొల్లు గ్రామ సచివాలయ ఆవరణలో సోమవారం స్పందన, గ్రామసభ  నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో పాల్గొన్న తహసీల్దార్‌ స్థానికుల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరిం చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు,  పాలవెల్లువ పథకాలపై అవగాహన కల్పిం చి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ సద్వినియోగం చేసుకోవాలన్నారు. సర్పంచ్‌ మంగి నేని సుధారాణి, రెవెన్యూ అధికారి ఏసుపాదం, కార్యదర్శి దుర్గాభవాని పాల్గొన్నారు.

ఉప్పలూరు (కంకిపాడు) : ప్రజా సమస్యల కోసం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగ పరుచుకోవాలని కంకిపాడు తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ అన్నారు. మండలలోని ఉప్పలూరులో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ టి.వి.సతీష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమాన్ని సద్విని యోగ పరుచుకోవాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులకు అంద కుండా, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతుంటే అటువంటి వారు ఈ స్పందన కార్యక్ర మాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లాం సోనియ్రా, ఈవోఆర్డి దుర్గాప్రసాద్‌, ఈవో శ్రీనివాసరావు, వీఆర్వో తుర్గా రావమ్మ పాల్గొన్నారు. 

Advertisement
Advertisement