ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం{ఎంపీ నామ

ABN , First Publish Date - 2021-01-26T05:39:43+05:30 IST

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. అందుకు సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా రన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం{ఎంపీ నామ
అంబులెన్స్‌ను ఎమ్మెల్యే సండ్రకు అందజేస్తున్న ఎంపీ నామా

మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి.. 

సత్తుపల్లి, జనవరి 25:ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. అందుకు సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా రన్నారు.  గిఫ్ట్‌ ఏ స్మైల్‌లో భాగంగా రూ.24లక్షల ఎంపీ ల్యాడ్స్‌ నిధుల నుంచి సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్‌ను ఆయన సోమవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలసి అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఐసీయూలో ఉండే ఏర్పాట్లు ఈ అంబులెన్స్‌లో ఉన్నాయని, ప్రమాదాలలో ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశ్యంతో జిల్లాకు 6అంబులెన్స్‌లను బహుకరిస్తున్నట్లు తెలిపారు. ఎక్కడాలేనటువంటి పథకాలు మన రాష్ర్టాల్లో ఉండగా సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను నేరుగా పేద లబ్దిదారులకే అందిస్తున్నామన్నారు. అనాడు వెంగళరావు, తుమ్మల హయాం నుంచి మంచి పేరున్న నియోజకవర్గంలో ప్రజా మనిషిగా ఎమ్మెల్యే సండ్ర ముందుకు కెళ్తున్న క్రమంలో మమ్ములని ఆదరిస్తూ ఆశ్వీర్వదించాలని కోరారు. రాష్ర్టానికి రావాల్సిన న్యాయమైన నిధులు, ప్రాజెక్టుల విషయంలో వచ్చే పార్లమెంట్‌ సమావేశాలలో ప్రస్తావిస్తానన్నారు. మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ ఎంపీ నామాను సన్మానించారు. అనంతరం మండలంలో పలు పరామర్శలలో ఆయన పాల్గొన్నారు.


మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి: సండ్ర


కరోనా వైరస్‌ విజృంభించిన వేళ ఎక్కువ కేసులు ఇక్కడ వచ్చిన కారణంగా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జిల్లా మంత్రి పువ్వాడ సహకారంతో రహదారుల అభివృద్ధి రూ.70కోట్ల నిధులు ఎంపీ నామా కలసి తీసుకొచ్చామని, అందులో రూ.33కోట్ల సింగరేణి నిధులతో కిష్టారం నుంచి 6లైన్‌ రహదారి నిర్మాణానికి కేటాయించామన్నారు. రాష్ట్ర రహదారులను అప్పటి మంత్రి తుమ్మల హయాంలో, ఆ తర్వాత తాను కూడా సీఎం కేసీఆర్‌ సహకారంతో గుంటలు లేకుండా రహదారులను చూసుకున్నామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, కమిషనర్‌ కే.సుజాత, ఆస్పత్రి వైద్యులు పీ.వసుమతీదేవి, కిరణ్‌, స్రవంతి, శివకృష్ణ, నరసింహారావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కల్లూరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెక్కిలాల లక్ష్మణరావు, వేంసూరు ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు యాగంటి శ్రీను, టీఆర్‌ఎస్‌ నాయకులు డాక్టర్‌ కూసంపూడి నరసింహారావు, కొత్తూరు ప్రభాకరరావు, తుళ్లూరు బ్రహ్మయ్య, చింతనిప్పు సత్యనారాయణ, కనగాల వెంకట్రావ్‌, పాలెపు రామారావుతో పాటు మునిసిపల్‌ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-26T05:39:43+05:30 IST