ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-10-15T05:34:26+05:30 IST

జోడెఘాట్‌లో ఈనెల 20న కుమ్రం భీం 81వ వర్ధంతి నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేయాలని ఆదివాసులు కోరుతున్నారు.

ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న ఆదివాసీ నాయకులు

- ఆదివాసీ సంఘాలు డిమాండ్‌

సిర్పూర్‌(యూ), అక్టోబరు 14: జోడెఘాట్‌లో ఈనెల 20న కుమ్రం భీం 81వ వర్ధంతి నిర్వహిస్తున్న సందర్భంగా ప్రజాదర్బార్‌  ఏర్పాటు చేయాలని ఆదివాసులు కోరుతున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు ప్రజాదర్బార్‌ నిర్వహించలేదన్నారు. ఈ సంవత్సరం కూడా కొవిడ్‌-19 దృష్టిలో పెట్టుకొని ప్రజాదర్బార్‌ను ఏర్పాటు చేయడం లేదని అధికారులు అంటున్నారని తెలిపారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రచారంలో వేల సంఖ్యంలో ప్రజలు పాల్గొంటున్నారు. అక్కడ లేని కొవిడ్‌-19 నిబంధన ఇక్కడ ఎందుకు అమలు చేస్తు న్నారని ప్రశ్నించారు. ప్రజాదర్బార్‌ అనేది ఆదివాసీలకు ముఖ్యమైన వేదిక అన్నారు. ప్రభుత్వం వెంటనే భీం వర్ధంతిని పురష్కరించుకొని జోడెఘాట్‌లో దర్బార్‌ ఏర్పాటు చేసి ఆదివాసీల సమస్యలు పరిష్క రించాలన్నారు. అదే విధంగా రాష్ట్రం నలుమూలలతోపాటు మహా రాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఆదివాసీలు భీం వర్ధంతికి ఒకరోజు ముందు జోడెఘాట్‌కు వస్తారన్నారు. వారికి రాత్రి బస, భోజన సౌకర్యం కల్పించాలన్నారు. అధికారులు వర్ధంతి రోజు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు కుమ్ర భీంరావు, మెస్రం భూపతి, కుడ్మేత యశ్వంత్‌రావు, అడ వేంకటేష్‌, ఆత్రం జ్యోతిరాం పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T05:34:26+05:30 IST