ప్రజలను అప్రమత్తం చేయండి

ABN , First Publish Date - 2021-04-20T04:46:20+05:30 IST

కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయాలని, మాస్కులు లేనిదే బయటకు రావద్దని ప్రచారం చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పల రాజు కోరారు. కరోనాను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు.

ప్రజలను అప్రమత్తం చేయండి
మాట్లాడుతున్న మంత్రి అప్పలరాజు

అధికారులతో మంత్రి అప్పలరాజు సమీక్ష

పలాస: కరోనాపై ప్రజలను  అప్రమత్తం చేయాలని, మాస్కులు లేనిదే బయటకు రావద్దని ప్రచారం చేయాలని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పల రాజు  కోరారు. కరోనాను ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపు నిచ్చారు. సోమవారం మునిసిపల్‌ కార్యాలయంలో నియోజక వర్గ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా బారినపడిన వారిని గుర్తించి తక్షణమే వైద్య సాయం అందించేందుకు సిద్ధం కావాల న్నారు. ఆసు పత్రుల్లో  బెడ్ల సంఖ్య పెంచాలని, సిబ్బంది అం దుబాటులో ఉండాలన్నారు. వార్డులు, గ్రామాల్లో ఇంటింటా సర్వే చేసి జ్వరపీడితులకు వైద్యం అందించాలన్నారు. కార్య క్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ డి.రాజ గోపాలరావు,  సీఐ శంకరరావు, తహసీల్దార్లు, ఎంపీడీ వోలు, పాల్గొన్నారు. 

 




 

Updated Date - 2021-04-20T04:46:20+05:30 IST