నాలుగు నెలల తర్వాత వినిపించిన ‘ప్రజావాణి’

ABN , First Publish Date - 2021-06-22T04:28:54+05:30 IST

నాలుగు నెలలుగా మూలనపడిన ప్రజావాణి సోమవారం వినిపించింది. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు.

నాలుగు నెలల తర్వాత   వినిపించిన ‘ప్రజావాణి’
ఫిర్యాదులను స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌

 87 దరఖాస్తుల స్వీకరణ

ఖమ్మంకలెక్టరేట్‌, జూన్‌21: నాలుగు నెలలుగా మూలనపడిన ప్రజావాణి సోమవారం వినిపించింది. ఫిబ్రవరి 16న ఎన్నికల నోటిఫికేషన్‌ అనంతరం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాఫిర్యాదుల స్వీకరణ ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిలిపివేశారు. ఆ తర్వాత కొవిడ్‌ నేపథ్యంలో గ్రీవెన్స్‌ను వాయిదా వేస్తూ వచ్చారు. అదే క్రమంలో మార్చి నెలలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి లాక్‌డౌన్‌ అమలయ్యింది. దీంతో ప్రజావాణి కార్యక్రమాన్ని నిలిపివేశారు. 

 నాలుగు నెలల తర్వాత...!

నాలుగు నెలల తర్వాత సోమవారం తిరిగి ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ ఎన్‌ మధుసూదన్‌, నగర పాలక కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డీఆర్వో ఆర్‌ శిరీష ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజల ఆర్జీలపై సంబందిత అధికారులను వేదిక వద్దకు పిలిచి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఈఈ శ్యాంప్రసాద్‌, లాండ్‌సర్వే ఏడీ ఓరుగంటి రాము, కలెక్టరేట్‌ ఏవో మధన్‌గోపాల్‌, రమణి, జడ్పీ డిప్యూటీ సీఈవో కొండపల్లి శ్రీరాం, జిల్లా శాఖల అధికారులు పాల్గొన్నారు.

  అధికారులకు అందిన ఆర్జీలు ఇవీ:

ఫ సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామ రెవెన్యూలో సర్వేనెంబర్‌ 211/ఉ/1/1లో 8 కుంటలు, సర్వెనెంబర్‌ 211/ఉ/1/2లో 20 కుంటల భూమిని ధరణి పోర్టల్‌లో ఆన్‌లైన్‌లో ప్రొహిబిటెడ్‌ జాబితాలో ఉంది. దాన్ని సత్తుపల్లి తహాసీల్దారు పరిశీలించి పట్టాభూమిగా గుర్తించి కార్యాలయానికి నివేదికలను అందించారని పట్టాభూమిగా పునరుద్దరించి పాసుపుస్తకాలను అందించాలని దేవబత్తిని వెంకటరాజ్య  అనే మహిళ అదనపు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేసింది.

ఫ తన గ్రామంలో ఎకరం 8కుంటల భూమి ఉందని దానిలో భూమిని ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువకు ఇచ్చామని మీసేవ పహణీలో అర ఎకరం తక్కువగా నమోదు చే శారని దీన్ని సరిచేయాలంటూ తిరుమలాయపాలేనికి చెందిన కొమ్ము రాములమ్మ ఫిర్యాదు చేశారు.

ఫ  తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని తన అన్నదమ్ములు వారి పేరుతో ఆర్వోఆర్‌ పట్టా చేయించుకున్నారని తనకు రావాల్సిన వాటా భూమిని తనకు ఇప్పించి పట్టా పుస్తకాలు ఇప్పించాలని కొణిజర్లకు చెందిన వడ్లమూడి కోటయ్య ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-06-22T04:28:54+05:30 IST