Abn logo
Oct 13 2021 @ 12:27PM

జగనన్న చేదోడు పథకం...ఉద్యోగుల మధ్య వివాదం

ఒంగోలు: ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరులో ఉద్యోగుల మధ్య వివాదం చెలరేగింది. జగనన్న చేదోడు పథకంలో తమ బంధువులను చేర్చలేదని గొడవకు దిగారు. ఈ క్రమంలో వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లికార్జున్‌పై పంచాయతీ కార్యదర్శి మహేష్ అసభ్య పదజాలంతో దూషించారు. ప్రభుత్వ ఉద్యోగులు పరస్పరం సవాళ్లు విసురుకున్నారు. పంచాయతీ కార్యదర్శి గుర్రం మహేష్‌ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహేష్‌ వ్యవహారంపై యూనియన్ నేతలు.. ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


ఇవి కూడా చదవండిImage Caption