రాజధాని మహిళా రైతులకు స్థానిక మహిళల నీరాజనాలు

ABN , First Publish Date - 2021-11-08T17:47:55+05:30 IST

ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రాజధాని మహిళా రైతుల పాదయాత్ర విరామం కావటంతో సమీప గ్రామాల మహిళలు భారీ ఎత్తున క్యాంపు వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు.

రాజధాని మహిళా రైతులకు స్థానిక మహిళల నీరాజనాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా ఇంకొల్లులో రాజధాని మహిళా రైతుల పాదయాత్ర విరామం కావటంతో  సమీప గ్రామాల మహిళలు భారీ ఎత్తున క్యాంపు వద్దకు చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు.  మహిళా రైతులకు స్థానిక మహిళలు నీరాజనాలు పలికారు. రాజధాని మహిళా రైతుల కోసం మహిళలు కోలాట ప్రదర్శన చేపట్టారు. రాజధాని ప్రాంత మహిళా రైతులను ఉత్తేజ పరిచేలా కోలాట ప్రదర్శన ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని మహిళా రైతులకు అండగా అడుగడుగునా స్థానికులు వెన్నంటే ఉంటారని వెల్లడించారు. 

Updated Date - 2021-11-08T17:47:55+05:30 IST