AP: భావన్నారాయణ స్వామి ఆలయంలో అద్భుతం

ABN , First Publish Date - 2021-10-04T13:35:40+05:30 IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెద్దగంజాంలోని భావన్నారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది.

AP: భావన్నారాయణ స్వామి ఆలయంలో అద్భుతం

ఒంగోలు: ప్రకాశం జిల్లా చినగంజాం మండలం పెద్దగంజాంలోని భావన్నారాయణ స్వామి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సోమవారం తెల్లవారుజామున స్వామివారి మూలవిరాట్టును సూర్యకిరణాలు తాకాయి. గర్భగుడిలోని స్వామిని  సూర్యభాగవానుడు 15 నిమిషాల పాటు కిరణాలతో అభిషేకించాడు. ప్రతి ఏడాది ఏప్రిల్, అక్టోబర్ మాసాల్లోని దక్షిణాయణ, ఉత్తరాయణ పుణ్యకాలాల్లో స్వామివారిని  సూర్యకిరణాలు తాకుతాయి. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు  భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయంలో అర్చకులు  ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాలుగు రోజుల పాటు స్వామి వారిని నిత్యం సూర్యకిరణాలు అభిషేకిస్తాయని అర్చకులు వెల్లడించారు. 

Updated Date - 2021-10-04T13:35:40+05:30 IST