Abn logo
Aug 25 2021 @ 08:00AM

Prakasam: ప్రభుత్వ పాఠశాలల్లో 12కు చేరిన కరోనా బాధితులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. పీవీఆర్ బాలికల హైస్కూల్‌లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు, ఓ ఎనిమిదవ తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే ఒంగోలు డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడితో సహా నలుగురు ఉపాధ్యాయులు, ఐదుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్‌లో కోవిడ్ థర్డ్ వేవ్‌పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో పాఠశాలల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.