ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా పేషంట్లకు తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2020-08-11T15:54:50+05:30 IST

ఒంగోలు జీజీహెహెచ్ ఐసోలేషన్‌లో కరోనా పాజిటివ్ పేషంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 6 గంటల నుండి

ఒంగోలు జీజీహెచ్‌లో కరోనా పేషంట్లకు తప్పని తిప్పలు

ప్రకాశం: ఒంగోలు జీజీహెహెచ్ ఐసోలేషన్‌లో కరోనా పాజిటివ్ పేషంట్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం 6 గంటల నుండి టాయిలెట్లకు వెళ్లేందుకు కూడా నీళ్లు లేక పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. గత రెండు రోజులుగా అరకొరగా వస్తున్న నీటితో కరోనా బాధితులు సర్దుకుంటున్నారు. నిన్న జీజీహెచ్ ఆవరణలో రెండు రోజులుగా మృతదేహం పడి ఉన్నా అధికారులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. మృతదేహాన్ని ముఖం, చెవులు కుక్కలు పీక్కుతింటున్నా అధికారులు అటు వైపు కన్నెత్తి చూడని దయనీయస్థితి నెలకొంది. రోజూ నాణ్యత లేని భోజనం, టిఫిన్‌లు పెడుతున్నారంటూ కరోనా పేషెంట్లు గగ్గోలు పెడుతున్నారు. భోజనాలపై మాట్లాడేందుకు  కాంట్రాక్టర్ అందుబాటులో లేకుండా పోయాడు. ఈ కారణంగా కరోనా బాధితులను ప్రాణాలకు తెగించి వైద్యం చేస్తున్న డాక్టర్ల కష్టం వృదా అవుతున్న వైనం నెలకొంది. అడ్మినిష్ట్రేషన్ డిపార్టుమెంటు నిర్లక్ష్యంతో జీజీహెచ్ అబాసుపాలవుతున్న పరిస్థితి ఏర్పడింది.

Updated Date - 2020-08-11T15:54:50+05:30 IST