ప్రకాశం జిల్లా: బరితెగిస్తున్న గుట్కా మాఫియా

ABN , First Publish Date - 2021-06-11T21:52:26+05:30 IST

ప్రకాశం: జిల్లాలో గుట్కా అక్రమార్కులు బరితెగించారు. వ్యాపారమే లక్ష్యంగా అక్రమ దందాకు తెరలేపారు.

ప్రకాశం జిల్లా: బరితెగిస్తున్న గుట్కా మాఫియా

ప్రకాశం: జిల్లాలో గుట్కా అక్రమార్కులు బరితెగించారు. వ్యాపారమే లక్ష్యంగా అక్రమ దందాకు తెరలేపారు. గుట్కాపై నిషేధం ఉన్నా లక్షలు సంపాదించాలన్న ఆశతో చిరు వ్యాపారులు సయితం గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. జిల్లాలో నకిలీ గుట్కాను తయారు చేసి గతంలో పోలీసులకు పట్టుపడ్డ ఉదంతాలు జరిగినా మాఫియాకు మాత్రం చెక్ పడడంలేదు.


కరోనా సమయాన్ని అవకాశంగా తీసుకుని గుట్కా వ్యాపారులు అక్రమాలకు తెరతీశారు. గుట్కా, ఖైనీ విక్రయాలను 2013 జనవరి నుంచి ప్రభుత్వం నిషేధించింది. దేశంలో గుట్కా తయారు చేసినా, అమ్మినా నేరం. దీన్ని ఆసరా చేసుకుని కొందరు అక్రమ రవాణాకు తెరతీశారు. గుట్కా, పాన్ మసాలాలకు అలవాటుపడినవారి బలహీనతలను ఆసరాగా చేసుకుని అసలు ధర కంటే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పోలీసుల దాడుల్లో గుట్టలకొద్ది గుట్కా నిల్వలు బయటపడ్డాయి. యంత్రసామాగ్రిని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-11T21:52:26+05:30 IST