Abn logo
Aug 5 2021 @ 13:38PM

కనిగిరిలో బరితెగిస్తున్న వైసీపీ నేతలు

ప్రకాశం జిల్లా: కనిగిరిలో వైసీపీ నాయకుల ఆక్రమణల పర్వం కొనసాగుతోంది. గతంలో అసైన్‌మెంట్ భూములు, స్థలాలు, కుంటలను ఆక్రమించిన నేతలు.. ఇప్పుడు ప్రైవేటు భూములపై కన్నేశారు. తమ స్థలాలను ఆక్రమించుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆక్రమించుకున్న భూములను వెంచర్లలో కలుపుకుని అధిక ధరలకు అమ్ముకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.