ప్రకాశం జిల్లా: అద్దంకిలో మందుబాబుల వీరంగం

ABN , First Publish Date - 2021-08-31T18:30:26+05:30 IST

ప్రకాశం జిల్లా: అద్దంకిలో మందుబాబుల ఆగడాలు శృతిమించాయి.

ప్రకాశం జిల్లా: అద్దంకిలో మందుబాబుల వీరంగం

ప్రకాశం జిల్లా: అద్దంకిలో మందుబాబుల ఆగడాలు శృతిమించాయి. స్థానికంగా ఉండే కొందరు యువకులు ఓ ముఠాగా ఏర్పడ్డారు. రాత్రి వేళల్లో మద్యం సేవిస్తూ.. ఘర్షణలకు దిగుతున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నారు. అద్దంకి వీవీఆర్ కార్ ట్రావెల్స్ యజమానితో ఓ ముఠా గొడవపడింది. అప్పట్లో ఓ కానిస్టేబల్ జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అప్పటి నుంచి ముఠాలోని కొందరు యువకులు వీవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన కార్లపై రాళ్లతో దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేశారు.


అర్థరాత్రి వేళ రోడ్లపై వెళుతున్నవారిని ఆపి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. వారిలో కొందరు మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో అనుమానితులుగా ఉన్నారు. ఈ ముఠాపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-08-31T18:30:26+05:30 IST