Abn logo
Sep 24 2021 @ 12:50PM

ప్రకాశంజిల్లా: ముండ్లమూరు ఎంపీపీ కోసం వైసీపీలో వర్గపోరు

ప్రకాశం జిల్లా: దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు మండలం ఎంపీపీ ఎన్నికలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ బెదిరింపులకు దిగారు. సొంత పార్టీలో గెలిచిన అభ్యర్థులకు ఆర్వోలు డిక్లరేషన్ ఫారం ఇవ్వడంలేదు. ముండ్లమూరు ఎంపీపీ కోసం వైసీపీలో వర్గపోరు జరుగుతోంది. ఎంపీపీ కోసం ఎమ్మెల్యే మద్దిశెట్టి, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ వర్గాల మధ్య పోరు నెలకొంది. డిక్లరేషన్ ఫారం దక్కకపోవడంతో ఎంపీటీసీ అభ్యర్థులు ఎంపీపీ ఎన్నికలో పాల్గొనలేక పోతున్నారు. ఎమ్మెల్యే ప్రోబ్దలంతో ఆర్వోలు డిక్లరేషన్ ఇవ్వలేదని మరోవర్గం ఎంపీటీసీలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం మధ్యాహ్నం విచారణ జరగనుంది.