పెట్రోల్, డీజిల్ ధరలపై సీపీఐ ధర్నా..

ABN , First Publish Date - 2021-10-28T20:09:07+05:30 IST

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సీపీఐ నేతలు ఒంగోలులో ధర్నా నిర్వహించారు.

పెట్రోల్, డీజిల్ ధరలపై సీపీఐ ధర్నా..

ప్రకాశం జిల్లా: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై సీపీఐ నేతలు ఒంగోలులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజీల్ ధరలు ప్రజలు భరించలేని స్థాయికి చేరుకున్నాయని విమర్శించారు. పెట్రోల్, డీజీల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా... పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడంలేదని మండిపడ్డారు. నిత్యవసరధరలు కూడా విపరీతంగా పెరిగాయని, గ్యాస్ సిలెండర్ ధర వెయ్యి రూపాయలుందన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజీల్‌పై విధిస్తున్న ట్యాక్స్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని సీపీఐ నేతలు కోరారు.

Updated Date - 2021-10-28T20:09:07+05:30 IST