Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రకాశం జిల్లాలో దారుణం

ప్రకాశం జిల్లా: మార్కాపురం, ఏకలవ్య కాలనీలో దారుణం జరిగింది. అప్పుడే పుట్టిన పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు ప్రక్కన వదిలి వెళ్లారు. రక్తపుమడుగులోఉన్న పసికందును చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో శిశువును అక్కడ వదిలివేశారని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement