అమరావతి జేఏసీ నేతలకు పోలీసుల నోటీసులు

ABN , First Publish Date - 2021-11-11T14:02:20+05:30 IST

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని రాజధాని రైతుల మహాపాదయాత్ర శిబిరం వద్దకు జిల్లా పోలీస్ యంత్రాంగం చేరుకుంది.

అమరావతి జేఏసీ నేతలకు పోలీసుల నోటీసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడులోని రాజధాని రైతుల మహాపాదయాత్ర శిబిరం వద్దకు జిల్లా పోలీస్ యంత్రాంగం చేరుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నందున పాదయాత్రలో ఇతరులు పాల్గొన కూడదని ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ప్రాంతానికి చెందిన 157 మంది రైతులు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అమరావతి జీఏసీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాగా పోలీసుల నోటీసులపై జేఏసీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా సాగుతున్న యాత్రకు తమకు నోటీసులు ఎలా ఇస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకు సంబంధించిన వారికి నోటీసులు ఇవ్వకుండా తమకు నోటీసు ఇవ్వడమేంటని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-11-11T14:02:20+05:30 IST