Prakasam: ప్రభుత్వ పాఠశాలల్లో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-28T13:22:45+05:30 IST

ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. నాలుగు రోజుల్లో దాదాపు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Prakasam: ప్రభుత్వ పాఠశాలల్లో దడ పుట్టిస్తున్న కరోనా కేసులు

ఒంగోలు: ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు దడ పుట్టిస్తున్నాయి. నాలుగు రోజుల్లో దాదాపు  కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 43 మంది ఉపాద్యాయులు, 24 మంది విద్యార్థులు, నలుగురు బోధనేతర సిబ్బందికి కూడా పాజిటివ్ అని తేలింది. ఉలవపాడు మండలం వీరేపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్‌, వెలిగండ్ల మండలం వెదుల్లచెరువు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్, డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం ప్రభుత్వం పాఠశాలలతో పాటు పలు స్కూళ్లలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ జిల్లాలోని పలు పాఠశాలల్లో  కొవిడ్ ప్రోటోకాల్ ఇంకా అమలు కాని పరిస్థితి ఉంది. కనీస భౌతిక దూరం పాటించకుండానే తరగతులను నిర్వహిస్తున్నారు. పాఠశాలల గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో శానిటైజర్ల కొనుగోలుకు నిధులలేమి ఏర్పడింది. 24న 35 మందికి, 25న 18 మందికి, 26న 11 మందికి, 27న ఏడుగురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలల్లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులతో ఇతర ఉపాద్యాయులు, విద్యార్థుల ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-08-28T13:22:45+05:30 IST