Abn logo
Sep 22 2021 @ 07:53AM

Prakasam: యనమదల ఎంపీటీసీ సభ్యుడు కిడ్నాప్ కలకలం

ఒంగోలు: ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల ఎంపీటీసీ సభ్యుడు శ్యాంసన్ కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఈనెల 20న ఇంటి నుండి బయటకు వెళ్లిన తన భర్త కనిపించటం లేదంటూ శ్యాంసన్ భార్య పరమగీతం  పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా యద్దనపూడి ఎంపీపీ పదవి విషయంలో వైసీపీకి చెందిన ఇరువర్గాల నేతల మధ్య పోటీ తలెత్తింది. ఎంపీపీ రేసులో ఉన్న వారే శ్యాంసన్‌ను క్యాంపుకు తరలించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption