Abn logo
Sep 22 2021 @ 08:10AM

ప్రకాశం జిల్లాలో ప్రబలిన విష జ్వరాలు

ఒంగోలు: ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాడులో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రతీ ఇంటిలోనూ జ్వర పీడితులు ఉన్నారు. జ్వరాల బారిన పడి పాఠశాల విద్యార్థులు మంచం పట్టారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో రోడ్లపైనే  మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. పారిశుద్ధ్యం అద్వాన్నంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వినతి చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption