పోలింగ్ రోజు రౌడీయిజం జరిగింది: ప్రకాశ్ రాజ్

పోలింగ్ రోజు రౌడీయిజం జరిగిందని అన్నారు ‘మా’ ఎన్నికలలో అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయిన నటుడు ప్రకాశ్ రాజ్. మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడుతూ.. ‘‘ మా ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్‌లోనూ అక్రమాలు జరిగాయి. బెనర్జీపై చేయి చేసుకున్నారు. పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు చాలా బాధ కలిగించాయి. అందుకే రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై అందరం కూర్చుని చర్చించాం. ‘మా’ ఎన్నికలలో గెలిచిన విష్ణు‌కి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు మా ప్యానల్‌లో గెలిచిన వారందరం రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. విష్ణుగారు వారికి నచ్చిన వారిని తీసుకుని పరిపాలన చేయాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నాం..’’ అని అన్నారు.

Advertisement
Advertisement