Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాము కాటుతో 7 నెలల గర్భిణి మృతి

ప్రకాశం: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పాము కాటుతో 7 నెలల గర్భిణి మృతి చెందింది. కొమరోలు మండలం, మలికలపల్లికిలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సుజాత రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటు వేసింది. క్షణాల్లోనే ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో ప్రాణాలు విడిచింది. అదే పాము ఇంకెవరినైనా కాటేస్తుందేమోనని గ్రామస్తులు పామును కర్రలతో కొట్టి చంపేశారు.

Advertisement
Advertisement