ప్రకాశం జిల్లా: కందుకూరులో టీడీపీ నేతల హౌస్ అరెస్టు

ABN , First Publish Date - 2021-10-27T20:13:28+05:30 IST

కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి.

ప్రకాశం జిల్లా: కందుకూరులో టీడీపీ నేతల హౌస్ అరెస్టు

ప్రకాశం జిల్లా: కందుకూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల హౌస్ అరెస్టులు కొనసాగుతున్నాయి. ఆర్టీవో కార్యాలయం ఎదుట టీడీపీ నిరసన కార్యక్రమాన్ని తలపెట్టింది. దీనికి అనుమతి లేదంటూ అర్థరాత్రి నుంచి టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాంను గృహనిర్భంధం చేశారు. ఇంటి చుట్టూ పోలీస్ పహార ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల దీక్షకు అనుమతి ఇచ్చి, టీడీపీకి ఎందుకు ఇవ్వరో చెప్పాలని శివరాం డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-10-27T20:13:28+05:30 IST