కంటైన్‌మెంట్ జోన్‌గా మాంగోర్ హిల్

ABN , First Publish Date - 2020-06-03T23:33:36+05:30 IST

గోవాలోని మాంగోర్ హిల్ ప్రాంతంలో గత 24 గంటల్లో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం...

కంటైన్‌మెంట్ జోన్‌గా మాంగోర్ హిల్

పనజి: గోవాలోని మాంగోర్ హిల్ ప్రాంతంలో గత 24 గంటల్లో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసులతో గోవాలో కరోనా పాజిటివ్ కేసుల 119కి చేరింది. వీటిలో 62 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 57 మందికి పూర్తి స్వస్థత చేకూరింది.


మాంగోర్ హిల్ రీజియన్‌ను కంటైన్‌మెంట్ జోన్‌గా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ బుధవారంనాడు ప్రకటించారు. వేగవంతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 200 మంది పేషెంట్లను పరీక్షించగా 40 కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆయన చెప్పారు. నైసర్గ తుఫానుపై మాట్లాడుతూ, ఇప్పటికే సైక్లోన్ అలర్ట్ ప్రకటించామని, సైక్లోన్ ప్రభావం తక్కువగానే ఉండొచ్చని చెప్పారు. రాబోయే రెండు రోజుల్లో వర్షాలు పడతాయన్న అంచనాలున్నాయని అన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనైందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని సావంత్ చెప్పారు.

Updated Date - 2020-06-03T23:33:36+05:30 IST