ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోలుకోవాలంటూ 72 గంటల అఖండ‌ యజ్ఞం

ABN , First Publish Date - 2020-08-12T11:33:06+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయ‌న మెద‌డుకు శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. అనంత‌రం ఆయ‌న వెటిలేట‌ర్‌పై ఉన్నారు. ఈ నేప‌ధ్యంలో ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ కోలుకోవాలంటూ ఆయ‌న...

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కోలుకోవాలంటూ 72 గంటల అఖండ‌ యజ్ఞం

కోలకతా: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ  ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయ‌న మెద‌డుకు శ‌స్త్ర‌చికిత్స జ‌రిగింది. అనంత‌రం ఆయ‌న వెటిలేట‌ర్‌పై ఉన్నారు. ఈ నేప‌ధ్యంలో ప్ర‌ణ‌బ్‌ముఖ‌ర్జీ కోలుకోవాలంటూ ఆయ‌న పూర్వీకుల గ్రామంలో 72 గంటలు అఖండ‌ యజ్ఞం నిర్వ‌హిస్తున్నారు. ఈ  యజ్ఞం జన్మాష్టమి నాడు బీర్‌భూమ్‌లో ప్రారంభమైంది. ఈ యజ్ఞం నిరాటంకంగా మూడు రోజుల పాటు కొనసాగ‌నుంది. ఈ సంద‌ర్భంగా యజ్ఞ నిర్వాహ‌కులు మాట్లాడుతూ తాము చేప‌ట్టిన ఈ మహామృతుంజయ యజ్ఞం ప్రణబ్ ముఖ‌ర్జీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంద‌న్నారు. ప్ర‌ణ‌బ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆయన సోదరి, ఇతర కుటుంబ సభ్యులు ప్రార్థించారు. 

Updated Date - 2020-08-12T11:33:06+05:30 IST