వెంటిలేటర్‌తో ప్రణబ్‌కు కొనసాగుతున్న చికిత్స

ABN , First Publish Date - 2020-08-15T07:55:41+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో శుక్రవారం ఉదయం వరకు ఎలాంటి మార్పులేదని ఆయనకు చికిత్స అందిస్తున్న ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌ డాక్టర్లు తెలిపారు...

వెంటిలేటర్‌తో ప్రణబ్‌కు కొనసాగుతున్న చికిత్స

న్యూఢిల్లీ, ఆగస్టు 14: మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిలో శుక్రవారం ఉదయం వరకు ఎలాంటి మార్పులేదని ఆయనకు చికిత్స అందిస్తున్న ఆర్మీ రిసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ హాస్పిటల్‌ డాక్టర్లు తెలిపారు. ఆయన ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉన్నారని, వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందుతోందని, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన కీలక సూచీలు నిలకడగా ఉన్నాయన్నారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మరీ దిగజారలేదని షర్మిష్ఠ ముఖర్జీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. కాగా, తన తండ్రి ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందు ఊరి నుంచి పనసపండు తీసుకురమ్మని కోరారని ప్రణబ్‌ కుమారుడు అభిజిత్‌ తెలిపారు. ఆయన కోరిక మేరకు పనస పండు తీసుకురాగా.. కొన్ని పనస తొనలను తిన్నారని, ఏ మాత్రం అనారోగ్యంగా లేరన్నారు. ఆ తర్వాత వారానికి అనారోగ్యంపాలై ఆస్పత్రిలో చేరారని తెలిపారు. 

Updated Date - 2020-08-15T07:55:41+05:30 IST