ఏడు భాషల్లో తొలిసారిగా... !

ABN , First Publish Date - 2020-11-22T06:01:49+05:30 IST

‘ఎదుట నిలిచింది చూడూ...’, ‘నిండు నూరేళ్ల సావాసం’ లాంటి పలు హిట్‌సాంగ్స్‌కు మ్యూజిక్‌ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్‌. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు పాటలు స్వరపరిచారు...

ఏడు భాషల్లో తొలిసారిగా... !

‘ఎదుట నిలిచింది చూడూ...’, ‘నిండు నూరేళ్ల సావాసం’ లాంటి పలు హిట్‌సాంగ్స్‌కు మ్యూజిక్‌ అందించిన ప్రముఖ సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్‌. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు పాటలు   స్వరపరిచారు.  ‘కమనీయమైన నీ ప్రేమలోన నే నిలువనా’, ‘రారాజు పుట్టాడోయ్‌ మారాజు పుట్టాడోయ్‌’ అనే ఆ  రెండు సువార్త పాటలు  యూట్యూబ్‌లో వీక్షకుల ఆదరణ పొందుతున్నాయి.   


ఈ సందర్భంగా కమలాకర్‌ మాట్లాడుతూ ‘‘కమనీయమైన నీ ప్రేమలోనా..’ పాట ఇండియాలోనే తొలిసారి ఏడు భాషల్లో విడుదలైంది. ఈ పాటను ఫేమస్‌ బెంగాలీ సింగర్‌ అన్వేషా మూడు భాషల్లో పాడారు. మిగతా భాషల్లోనూ టాప్‌ సింగర్స్‌ పాడారు. ఈ పాటకు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే రెండు రోజుల క్రితం విడుదల చేసిన ‘రారాజు పుట్టాడోయ్‌...’ పాటను ఫేమస్‌ సింగర్‌ హరిచరణ్‌ అద్భుతంగా ఆలపించారు. లిరికల్‌, సింగింగ్‌, రిథమిక్‌, మిక్సింగ్‌ లాంటి విషయాల్లో కాంప్రమైజ్‌ కాకుండా ఫుల్‌ ఫోకస్డ్‌గా పూర్తి డివోషనల్‌ టచ్‌తో  కంపోజ్‌ చేశాను. తమిళనాడు, మధురై  కేరళ నుంచి రిథమ్‌ సెక్షన్స్‌, కొరియోగ్రాఫర్‌ ్సని పిలిపించాం. ప్రముఖ వయోలనిస్ట్‌ దీపక్‌ పండిట్‌,  సితార్‌ విద్వాంసుడు  పుర్భయాన్‌ చటర్జీతో వర్క్‌ చేశాం. కొవిడ్‌  టైమ్‌ కావడంతో తగిన జాగ్రత్తలు తీసుకొని రికార్డ్‌ చేశాం. మామూలుగా సినిమా పాటలకే ఎక్కువగా ఆదరణ ఉంటుంది. కానీ ఈ సువార్త పాటలకు ఎక్సట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తోంది. ఔట్‌ పుట్‌ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా విజువల్‌గా ది బెస్ట్‌గా ఉండేలా ప్లాన్‌ చేశాం. ఈ గీతాలను రచించి, నిర్మించిన జోష్వాషేక్‌ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అన్నారు.

Updated Date - 2020-11-22T06:01:49+05:30 IST