కొవిడ్‌ ఆస్పత్రుల జాబితా నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి తొలగింపు

ABN , First Publish Date - 2020-12-05T04:51:15+05:30 IST

ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించామని, ఇకపై ఇక్కడ కొవిడ్‌కు వైద్య సేవలు అందించరని వైద్య విధాన పరిషత్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు తెలిపారు.

కొవిడ్‌ ఆస్పత్రుల జాబితా నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రి తొలగింపు
ప్రాంతీయ ఆస్పత్రిలో రికార్డులు పరిశీలిస్తున్న కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు

  ఇకపై మేజర్‌ ఆపరేషన్లకు ఇబ్బందులు ఉండవు

  ప్రసూతి విభాగానికి ముగ్గురు డాక్టర్ల నియామకం

  కరోనా బాధితులకు కేజీహెచ్‌లోనే సేవలు

   వీవీపీ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు


నర్సీపట్నం, డిసెంబరు 4 : ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రుల జాబితా నుంచి తొలగించామని, ఇకపై ఇక్కడ కొవిడ్‌కు వైద్య సేవలు అందించరని వైద్య విధాన పరిషత్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మణరావు తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగాన్ని సందర్శించి మాట్లాడారు.  ఇకపై కొవిడ్‌ బాధితులకు విశాఖపట్నం కేజీహెచ్‌లోనే చికిత్సలు జరుపుతారన్నారు. ఆరోగ్యశ్రీ వైద్య విభాగంలో శస్త్ర చికిత్సలు ఎలా జరుగుతున్నాయన్న అంశాలపై అధ్యయనానికి ప్రత్యేక బృందాలు జిల్లాలో పర్యటిస్తున్నట్టు చెప్పారు. ఇందులో భాగంగానే తాను ఇక్కడికి విచ్చేశానన్నారు.  ఇన్నాళ్లూ కొవిడ్‌ విభాగం ఉండడంతో ప్రాంతీయ ఆస్పత్రిలో మేజర్‌ ఆపరేషన్లు జరగలేదని, ఇకపై ఆ ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ప్రసూతి విభాగానికి కొత్తగా ముగ్గురు డాక్టర్లను నియమించామన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలవేణిదేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-05T04:51:15+05:30 IST