Abn logo
Dec 4 2020 @ 16:19PM

`సలార్`.. ప్రభాస్ ఎందుకో చెప్పిన దర్శకుడు!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే భారీ పాన్ ఇండియా చిత్రం `సలార్`. ఇటీవలె ఈ సినిమా ఫస్ట్‌లుక్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో `సలార్` టైటిల్ గురించి, ఆ సినిమాలో ప్రభాస్‌ను కథానాయకుడిగా తీసుకోవడం గురించి తాజాగా ప్రశాంత్ నీల్ మాట్లాడాడు. 


``సలార్` టైటిల్‌కు రకరకాల అర్థాలు చెబుతున్నారు. నిజానికి అది ఒక ఉర్దూ పదం. `సలార్` అంటే సమర్థవంతమైన నాయకుడని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌నే ఎందుకు తీసుకున్నారని చాలా మంది అడుగుతున్నారు. నా కథకు ప్రభాస్ కరెక్ట్‌గా సరిపోతాడు. అమాయకంగా ఉండే వ్యక్తి కరడుగట్టిన నాయకుడిగా ఎలా మారాడో నా సినిమాలో చూపించబోతున్నా. అమాయకత్వాన్ని, రౌద్రాన్ని అద్భుతంగా పండించగలిగే హీరో ప్రభాస్. అందుకే అతణ్ని హీరోగా ఎంచుకున్నాన`ని ప్రశాంత్ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement