Abn logo
Aug 12 2020 @ 17:14PM

ఎన్టీయార్ కంటే ముందు ప్రభాస్‌తో..?

`కేజీఎఫ్` సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రశాంత్ `కేజీఎఫ్-2`తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీయార్‌తో ప్రశాంత్ సినిమా చేయబోతున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సీన్‌లోకి ప్రభాస్ ఎంటర్ అయ్యాడు. 


`కేజీఎఫ్` నిర్మాతలకు ప్రశాంత్ మరో సినిమా చేయాల్సి ఉందట. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించబోతున్నాడట. ప్రశాంత్‌కు, ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉంది. ఆ స్థాయిలోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుందట. అయితే ఈ సినిమా ఎన్టీయార్ సినిమా తర్వాతా, ముందా అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రభాస్ ప్రస్తుతం `రాధేశ్యామ్` చేస్తున్నాడు. ఆ తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా పట్టాలెక్కనుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. 

Advertisement
Advertisement
Advertisement