Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 12 2021 @ 16:36PM

జగన్‌పై ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: సీఎం జగన్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రోళ్లన్నారని, ఈ రోజు జగన్‌ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని చెప్పారు. అందుకే మోటార్లకు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. నిధులు లేక జగన్‌ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఎద్దేవాచేశారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఎద్దేవా చేసినవారే.. బిచ్చమెత్తుకుంటున్నారని తెలిపారు. ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్నారు. కేంద్రం ఒత్తిడితోనే ఏపీలో మోటార్లకు మీటర్లు పెట్టారని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement