May 18 2021 @ 09:16AM

‘అ2’ ఆగిపోవ‌డానికి కార‌ణం చెప్పిన ప్ర‌శాంత్ వ‌ర్మ‌

వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ‘అ’ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ యంగ్ డైరెక్ట‌ర్ ‘అ2’  సినిమాను కూడా తెర‌కెక్కిస్తాడ‌నే వార్త‌లు నెట్టింట బ‌లంగా వినిపించాయి. అయితే ప్ర‌శాంత్ వ‌ర్మ మాత్రం ‘జాంబి రెడ్డి’ చిత్రాన్ని తెర‌కెక్కించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. అస‌లు ‘అ2’  సినిమాను ఎందుకు తెర‌కెక్కించ‌లేదో.. అనే విష‌యాన్ని రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు ప్ర‌శాంత్‌. ‘అ2’ స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధ‌మైంద‌ని, ఓ బాలీవుడ్ స్టార్‌తో దీన్ని పాన్ ఇండియా సినిమాగా చేయాల‌నుకున్నార‌ట‌. అంతా ఓకే అయిన త‌ర్వాత స‌ద‌రు బాలీవుడ్ స్టార్ డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేన‌ని చెప్పేశాడ‌ట. దీంతో ‘అ2’  సినిమా వెన‌క్కి వెళ్లింద‌ని తెలియ‌జేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.