ప్రత్తిపాడు శివాలయంలో.. దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం

ABN , First Publish Date - 2021-10-17T07:59:43+05:30 IST

ప్రత్తిపాడు శివాలయంలో దేవతామూర్తి విగ్రహాలను దుండగుడు ధ్వంసం చేశాడు.

ప్రత్తిపాడు శివాలయంలో..  దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం

 కేసు నమోదైన ఐదు గంటల్లో నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

 మానసిక వ్యాధితోనే నేరానికి పాల్పడ్డాడని ప్రాథమికంగా నిర్ధారణ

ప్రత్తిపాడు, అక్టోబరు 16: ప్రత్తిపాడు శివాలయంలో దేవతామూర్తి విగ్రహాలను దుండగుడు ధ్వంసం చేశాడు. ఈ సంఘటన శుక్రవారం వేకువజామున జరగగా ఏబీఎన్‌ ఆం ధ్రజ్యోతి దీనిపై విస్తృత కథనాలు ప్రచారం చేసింది. దీంతో 24గంటల వ్యవధిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శనివారం మధ్యాహ్నం పోలీస్‌ స్టేషన్‌లో వివరాలను మీడియాకు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు వివరాలను తెలిపారు. పోలీసులు కథనం ప్రకారం ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రత్తిపాడులోని గోవిందరాజులు చెరువు గట్టుపై ఉన్న అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామి పంచాయతన క్షేత్రం లో శివాలయం బయట గోడల్లో ఏర్పాటు చేసిన గాయిత్రి అమ్మవారు, వినాయక, సంతోషిమాత, దుర్గాదేవి విగ్రహాలను దండుగుడు సుత్తితో కొట్టి ధ్వంసం చేశాడు. దీనిపై ఆలయ పూజారి ప్రత్తిపాడు పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఎస్పీ రవీంద్రనాథ్‌ వెంటనే స్పం దించడంతో క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో క్రైం బృందాలు కాకినాడ హెడ్‌క్వార్టర్‌నుంచి ప్రత్తిపాడు తరలివచ్చి ఆలయంవద్ద వివరాలు సేకరించాయి. పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, ఇన్‌చార్జ్‌ సీఐ కె.కిశోర్‌బాబు నాయకత్వంలో ఎస్‌ఐలు సుధాకర్‌, విద్యాసాగర్‌, రవికుమార్‌ దీనిపై ముమ్మర గాలింపు నిర్వహించారు. సాంకేతిక, క్షేత్రస్థాయి సమావేశం సీసీ ఫుటేజ్‌లతో నేర సమాచారం అందిన ఐదు గంటల్లో కేసును చేధించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లా పొందూరు మండల బురిడేకంచరం గ్రామానికి చెందిన వందన దాలినాయుడిగా గుర్తిం చారు. నిందితుడు ఏడాదికాలంగా అనారోగ్యంగా ఉండి తాగుడుకు బానిసై నరాల వ్యాధితో బాధపడుతూ మానసికంగా ఒత్తిడికి లోనై తన ఆరోగ్యం బాగుపడాలని ఈ శివాలయాన్ని 11 సార్లు సందర్శించాడని పోలీసులు తెలిపారు. స్థానికంగా ఉన్న ఒక లేఅవుట్‌లో భార్యతో కలిసి తాపీ పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తన పిల్లలను శ్రీకాకుళంలో చదివించుకుంటూ నరాల, మానసిక వ్యాధికి శ్రీకాకుళంలోనే వైద్యం పొందుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. తన వ్యాధి తగ్గకపోవడంతో మనస్తాపానికి గురై శుక్రవారం తెల్లవారుజామున ఉదయం 4గంటలకు లేచి తాపీ పనిచేసే సుత్తి తీసుకుని శివాలయంలో గోడలపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను ప గలకొట్టి ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఊరిచివర హైవే రోడ్డులో ఉన్న లేఅవుట్‌లో ఉన్న రేకులషెడ్‌ లో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేసి శనివారం స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఈ సంఘ టనలో నిందితుడిని 24గంటల్లోనే అరెస్ట్‌ చేసిన సీఐ కిశోర్‌బాబు, ఎస్‌ఐ సుధాకర్‌, రవికుమార్‌, విద్యాసాగర్‌లను ఎస్పీ, డీఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు అందజేయనున్నామన్నారు.



Updated Date - 2021-10-17T07:59:43+05:30 IST