Abn logo
Aug 1 2021 @ 17:30PM

జైలర్‌ని ఎందుకు మార్చారు?: మాజీ మంత్రి పత్తిపాటి

గుంటూరు: మాజీ మంత్రి దేవినేని ఉమా అక్రమంగా అరెస్టు దారుణమైన చర్య అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఉమా అరెస్ట్‌ను  తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరగకపోతే ఉమాను ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ అక్రమాలను ఎవరు ప్రశ్నించిన అక్రమ కేసులు పెడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ కేసులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. దేవినేని ఉమాని జైలులో పెట్టిన తర్వాత అక్కడ జైలర్‌ని ఎందుకు మార్చారు? అని ప్రశ్నించారు.ఉమాపై దాడి చేయడానికా లేక హతమార్చడానికా? అన్నారు.