Advertisement
Advertisement
Abn logo
Advertisement

నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం : కిలివేటి


పెళ్లకూరు, నవంబరు 30 : మండలంలో భారీ వర్షాలతో పంటలు, నారుమళ్లు దెబ్బతిన్న ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ య్య పేర్కొన్నారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం అధికారులు,  ప్రజాప్రతినిధులతో జరిగిన  సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్‌మోహన్‌రె డ్డి తుఫాన్‌ బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులందరికీ  80శాతం సబ్సిడీతో వరి విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. భారీ వర్షాల వల్ల ఇళ్లు పడిపోయిన 15 కుటుంబాలకు పొజిషన్‌ సర్టిఫికెట్లు, పక్కాగృహాల పత్రాలను అందించారు. అలాగే రైతులకు సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సరోజిని, ఎంపీపీ పోలంరెడ్డి శేఖర్‌రెడ్డి, జడ్పీటీసీ ప్రిస్కిల్లా, తహసీల్దారు కటారి జయజయరావు, వ్యవసాయాధికారిణి జీ ప్రవీణ,  వైసీపీ నాయకులు మా రాబత్తిన సుధాకర్‌, లింగంనాయుడు, సర్పంచు మైలారి వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement