ప్రతిపాదనలు భళా..

ABN , First Publish Date - 2021-09-17T04:59:36+05:30 IST

అటు చెన్నై-బెంగుళూరు ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ (సీబీఐసీ), ఇటు చెన్నై - విశాఖ ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ (సీవీఐసీ)లకు మధ్యలో జిల్లా ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి.

ప్రతిపాదనలు భళా..
నెల్లూరు-బద్వేలు రోడ్డు

జిల్లాలో పెద్ద ఎత్తున హైవేల పనులు

పోర్టు అనుసంధానంగా ఆరు వరుసల రోడ్లు

గ్రీనఫీల్డ్‌ రహదారుల నిర్మాణానికి కసరత్తు

నెల్లూరు పరిధిలో మూడు ఫ్లైఓవర్లకు గ్రీనసిగ్నల్‌

త్వరలో టెండర్లు పిలవనున్న ఎనహెచఏఐ అధికారులు


నెల్లూరు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : అటు చెన్నై-బెంగుళూరు ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ (సీబీఐసీ), ఇటు చెన్నై - విశాఖ ఇండసి్ట్రయల్‌ కారిడార్‌ (సీవీఐసీ)లకు మధ్యలో జిల్లా ఉండటంతో పారిశ్రామిక అభివృద్ధికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున గ్రీనఫీల్డ్‌ రహదారులు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల అధీకృత సంస్థ (ఎనఏహెచఏఐ) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు పూర్తయి ఉన్నతస్థాయిలో అనుమతి కోసం పంపగా మరికొన్ని ప్రతిపాదనలు తుది దశలో ఉన్నాయి. ఈ ప్రతిపాదనల్లో చాలా వరకు వచ్చే ఆర్థిక సంవత్సరంలోపు గ్రౌండింగ్‌ చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. కృష్ణపట్నం పోర్టును అనుసంధానం చేస్తూ ఆరు వరుసల రహదారులను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పారిశ్రామికంగా జిల్లా మరింత అభివృద్ధి చెందడంతో పాటు మెట్ట ప్రాంతాల్లో కూడా భూముల విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. 


నెల్లూరు నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటోంది. నెల్లూరు- ముత్తుకూరు రోడ్డును నాలుగు వరుసల రహదారిగా మార్చేందుకు ఎనహెచఏఐకు అనుమతులు లభించాయి. 24 కిలోమీటర్లు మేర రూ.258 కోట్లతో విస్తరించనున్న ఈ రహదారికి సంబంధించి అలైనమెంట్‌ పనులు కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించి డీపీఆర్‌ తయారీ కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 


నాలుగు వరుసలుగా ఉన్న రామదాసుకండ్రిగ - కృష్ణపట్నం పోర్టును ఆరు వరుసలుగా విస్తరిస్తున్నారు. సుమారు రూ.300 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాయలసీమ నుంచి కడప జిల్లా మీదుగా వస్తున్న వాహనాలు బద్వేలు నుంచి నెల్లూరు వచ్చి, అక్కడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్నాయి.  ఇప్పుడున్న నెల్లూరు - బద్వేలు రోడ్డు చిన్నది కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాయలసీమకు కనెక్టివిటీని మరింత సులభతరం చేసేందుకు ప్రత్యేక రహదారిని ఆరు వరుసలతో నిర్మించాలని ప్రతిపాదించారు. బద్వేల్‌ నుంచి రామదాసుకండ్రిగ వద్ద ప్రారంభమయ్యే పోర్టు రోడ్డుకు కొత్త రోడ్డును అనుసంధానిస్తారు. ఇప్పుడున్న నెల్లూరు - బద్వేల్‌ రోడ్డుతో సంబంధం లేకుండా 107 కిలోమీటర్ల మేర నిర్మించే గ్రీనఫీల్డ్‌ రోడ్డును సుమారు రూ.3 వేల కోట్లతో అంచనాలు తయారు చేస్తున్నారు. అలానే నెల్లూరు - బద్వేల్‌ రోడ్డు నిర్వహణ బాధ్యతను కూడా ఎనహెచఏఐ చేపట్టేందుకు త్వరలోనే అనుమతులు వస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. 


సాగరమాల ప్రాజెక్టులో భాగంగా చిల్లకూరు మండలం వరగలి క్రాస్‌ రోడ్డు నుంచి తూర్పు కనుపూరు మీదుగా తమ్మినపట్నం వరకు నాలుగు వరుసల గ్రీనఫీల్డ్‌ రహదారిని నిర్మించేందుకు ప్రతిపాదించారు. మొత్తం 36 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ రోడ్డుకు సుమారు రూ.900 కోట్లతో అంచనా తయారు చేస్తున్నారు. అలానే నాయుడుపేట నుంచి తూర్పు కనుపూరు వరకు 35 కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపారు. సుమారు రూ.1300 కోట్ల అంచనాతో నిర్మించబోయే ఈ రోడ్డుకు సంబంధించి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రస్తుతమున్న పోర్టు గేట్‌ రోడ్డుపై ప్రయాణం కొంత కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో ముత్తుకూరు నుంచి పోర్టు సౌత గేటు (తమ్మినపట్నం) వరకు సుమారు రూ.580 కోట్లతో ఆరు వరుసల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ ప్రతిపాదనలన్నీ ఎనహెచఐఏ ఉన్నతాధికారుల వద్దకు చేరాయి. త్వరలోనే వీటిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సంబంధిత అధికారులు చెబుతున్నారు. 


నెల్లూరు నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో నగర పరిధిలో ముఖ్యమైన జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించాలని చాలా కాలం నుంచి ఎనహెచఏఐ అధికారులతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చెన్నై వైపు నుంచి నెల్లూరులోకి ప్రవేశించే చోట (అయ్యప్పగుడి ప్రాంతం), గొలగమూడి జంక్షనల వద్ద ఫ్లైఓవర్లు నిర్మాణం, సింహపురి ఆసుపత్రి వద్ద అండర్‌పాస్‌ నిర్మాణానికి ఎనహెచఏఐ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లభించాయి. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు ఎనహెచఏఐ అధికారులు తెలిపారు. 



Updated Date - 2021-09-17T04:59:36+05:30 IST