Advertisement
Advertisement
Abn logo
Advertisement

15వ ఆర్దిక సంఘం నిధులను ప్రభుత్వం లాగేసుకోవడం దుర్మార్గం: ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం లాగేసుకోవడం దుర్మార్గమన్నారు. పంచాయతీ నిధుల విషయంలో ఏపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన ఇళ్లకు వన్‌టైం సెటిల్‌మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దుర్మర్గమన్నారు. టీడీపీ వారి ఓట్లు తొలగింపుకే చేర్పులు... మార్పుల ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోందన్నారు. అర్హత  ఉన్న ఒక్క ఓటు తొలిగించిన కోర్టులో కేసులు వేస్తామని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

Advertisement
Advertisement