Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ పతనం ప్రారంభమైంది: ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు: నీచ రాజకీయాలు చేస్తున్న వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలకు పుట్టగతులుండవని అన్నారు. సభలో వ్యక్తిగత విమర్శలు చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను వారించకుండా వికృత ఆనందం పొందే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమన్నారు. పరిపాలన చేతగాక వ్యక్తిగతంగా,  మానసికంగా వేధించడమే పనిగా పెట్టుకున్న మంత్రులు ఎమ్మెల్యేలను ప్రజలు ఛీ కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement